Wednesday, January 22, 2025

సివిల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థికి రూ.లక్ష ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: ఇంటర్నేషనల్ వైశ్య ఫడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు ఆధ్వర్యంలో వైశ్య ఫడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గట్టు మహేష్ బాబు సమక్షంలో కాపర్తి ప్రణీత్ కుమార్ కు ఐఎఎస్ లో చదువు నిమిత్తం వైశ్య ఫడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్ గుప్తా ఆదేశానుసారం ఒక లక్ష రూపాయల చెక్కును వారి తండ్రి కోటిలింగానికి ఆదివారం అందజేశారు. ఈ సందర్బంగా వైశ్య ఫడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు గట్టు మహేష్ బాబు మాట్లాడారు. వైశ్య సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరూ బిటెక్ లు ఎంటెక్ లు ఇంకా వేరే చదువులు చదువుతున్నారని ఐఎఎస్ చదివే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున ఐఎఎస్ చదువుకుంటే వైశ్య ఫడరేషన్ నుంచి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త టి వీరన్న, ప్రధాన కార్యదర్శి గుమ్మడవెల్లి సురేష్, ఉపాధ్యక్షుడు బెల్దే వెంకన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వల్లాల శైలజ, పిఆర్వో ఎలగందుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గల్లంతు ఖాయం: పల్లా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News