Monday, November 25, 2024

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
International women's day 2022
మహిళా విశ్వవిద్యాలయం ప్రకటించినందుకు సిఎంకు ధన్యవాదాలు
న్యూట్రిషియన్, హైజెనిక్ కిట్స్ ఇవ్వడం చారిత్రాత్మకం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్

హైదరాబాద్ : మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సత్యవతిరాథోడ్ పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 40 మందిని మంత్రి సత్యవతిరాథోడ్ సన్మానించారు. శాలువాలు కప్పి, లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం అందజేశారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో అద్భుతమైన పథకాలు అమలు జరుగుతున్నాయని వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు తెలియజెప్పి, వారందరినీ భాగస్వామ్యం చేశామన్నారు.

గర్భిణీలు, బాలింతలకు భోజనం, పాలు, గుడ్డుతో పాటు కేసిఆర్ కిట్ కింద నెలకు 2వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి, 13 వేల రూపాయలు ఇచ్చి, కిట్ లో బ్రాండెడ్ వస్తువులు అందిస్తున్నారన్నారు. ఈ పథకానికి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్యలక్ష్మీ పథకంతో పోషకాహారం అందిస్తున్నాం. కల్యాణలక్ష్మిపథకం కింద దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. పోషకాహార లోపాన్నిఅధిగమించేందుకు న్యూట్రీషియన్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. బాలికలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమని మంత్రి కొనియాడారు. సఖి, భరోసా కేంద్రాలు మహిళల భద్రత కోసం అమలు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మహిళా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ ఆకుల లలిత, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు శోభారాణి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, షాద్‌నగర్ జడ్పీటీసి రాజమ్మ, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News