Tuesday, November 5, 2024

ఆపడం ఎవరి తరం?

- Advertisement -
- Advertisement -

ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉంది. వ్యవసాయ ప్రాధాన్యత గల గణాలలో మాతృస్వామ్యం, పశుపాలక గణాల్లో పితృస్వామ్యం కనబడుతుంది. ఆర్యులు పశు పాలక గణం అక్కడ పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. ఆర్య ప్రభావానికి లోను కాని కేరళలో మాతృస్వామ్యం కనిపిస్తుంది. ప్రపంచం మొత్తంలో అనేక కారణాల చేత మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్య వ్యవస్థకు మార్పు చెందింది. భారత దేశంలో చూసినట్లయితే ఆర్య గణాలు రాక పూర్వం మాతృస్వామ్య నాగరికత వ్యవస్థ అమలులో ఉన్నట్టు చరిత్ర నిరూపించింది. ఆర్య సంస్కృతికి దూరంగా ఉన్న గిరిజనులో మాతృస్వామ్యం కనిపిస్తుంది. స్త్రీలు ఉత్పత్తి పరికరాలకు దూరమవడం పురుషులు వాటిపై ఆధిపత్యం చెలాయించడం, సంపాదించడం బానిస వ్యవస్థ మొదలైన గుంపు పెళ్లి నుండి దంపతీ వివాహం వ్యక్తిగత ఆస్తి ఆయుధాల మీద పురుషుల ఆధిక్యత మొదలైన వాటి వల్ల స్త్రీ వెనక్కి నెట్టి వేయబడింది.

క్రమంగా పురుషాధిక్యత ఏర్పడింది. ఇక స్త్రీ విద్య విషయానికి వచ్చినట్లయితే స్త్రీలు విద్యావంతులు కానంత వరకు ఏ దేశమూ బాగుపడదు. మన అభివృద్ధి అంతా స్త్రీల అభివృద్ధి పైనే ఆధారపడి ఉన్నది. పురుషులతో సమానంగా స్త్రీలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధ్యం. విద్యలేని వారు పశువుతో సమానం కదా మరి విద్య లేని స్త్రీలలో స్త్రీలతో ఉండే పురుషుల సంగతి ఏమిటి? విద్యాధికులం అని గర్వపడే పురుషులకి ఇది చెంపపెట్టు. ఎన్నో దశాబ్దాలుగా స్త్రీలు విద్యకి దూరమైనారు, కొన్ని దశాబ్దాలుగా ఎందరో మహానుభావుల కృషి వల్ల విద్య స్త్రీలకు కూడా అందుబాటులోకి వచ్చింది. కావున వారు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారు. ఇదే అవకాశం మొదటి నుంచి ఉంటే ఆ అభివృద్ధి ఊహించనలవి కానిది. స్త్రీలు ఎన్నో రంగాల్లో చేరి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడది అబల కాదు సబల అని నిరూపించుకున్నారు. కానీ ఉద్యోగ ధర్మంతో పాటు ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం తన బాధ్యత అయింది.

ఈ పనుల్లో సమతుల్యం పాటించక తప్పడం లేదు.. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శతాబ్దానికి మించిన చరిత్ర ఉంది. 1908 సంవత్సరంలో తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు భారీ ప్రదర్శన చేయడం వల్ల సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1975వ సంవత్సరంలో అధికారికంగా గుర్తించింది. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విభిన్న థీమ్‌లతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 2023లో ఆవిష్కరణ, సాంకేతికలో లింగ సమానత్వం అనే అంశాన్ని థీమ్‌గా నిర్ణయించడం జరిగింది. సాంకేతిక అభివృద్ధిలో మహిళలు, ఇతర అట్టడుగులు పాలు పంచుకుంటున్నప్పుడు మహిళల అవసరాలను తీర్చే, లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆవిష్కరణ సంభావ్యత పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా వారి అసాధారణ ఆర్థిక పరిణామాలను కలిగి ఉంటుంది.

ఐకాస, ఉమెన్స్ జెండర్స్ స్నాప్ షాట్ 2022 నివేదిక ప్రకారం డిజిటల్ ప్రపంచంలో మహిళలు లేకపోవడం వల్ల గత పదేళ్లలో తక్కువ, మధ్య ఆదాయ దేశాల స్థూల జాతీయోత్పత్తి తగ్గింది. ఏమీ చేయలేక పోయినట్లయితే ఈ నష్టం 2025 నాటికి పెరుగుతుంది. అందువల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 డిజిటల్ లింగాలలో మహిళలు, బాలికల హక్కులను రక్షించడం, టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఫర్ జెండా ఈక్వాలిటీ కింద ఆన్‌లైన్ సదుపాయం కల్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మహిళ అన్ని రంగాల్లో బుల్లెట్‌లా ముందుకు దూసుకుపోతున్నది. ఆమె గెలుపు, ప్రగతిని ఆపటం ఎవరి తరమూ కాదు.

స్వప్న కొండ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News