Monday, December 23, 2024

అలుపెరుగని జీవన కెరటం ‘ఆమె’

- Advertisement -
- Advertisement -

కీర్తి శిఖరాల వైపు దూసుకెళ్తున్న మహిళలు
వంటింటి నుంచి అంతరిక్షం వరకు
సామాజిక సేవల్లోనూ ముందంజలో
రాజకీయాల్లోనూ రాణిస్తున్న వైనం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ
‘మన తెలంగాణ’ అక్షర నీరాజనం

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని శాస్త్రం చెప్పిన మాటకు సార్థకత చేకూర్చేలా నేడు మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తూ కీర్తి శిఖరాల వైపు దూసుకెళ్తున్నారు. వంటిల్లు మొదలుకొని అంతరిక్షయానం వరకు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ వైజ్ఞానిక ప్రపంచంలోనూ తమ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. సామాజిక సేవలోనూ ముందువరసలో నిలుస్తున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తూ ప్రజాక్షేత్రంలో తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. తల్లిగా చెల్లిగా ఆలిగా అపర కాళిగా ఆమె చూపుతున్న ఔదార్యం యావత్ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. అంతటి మహోన్నత వ్యక్తిత్వం, ఔచిత్యం కలిగిన మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ మనతెలంగాణ అక్షర నీరాజనం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News