Saturday, November 23, 2024

అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

అన్నిరంగాల్లో స్త్రీలకు తగిన గౌరవం కల్పిస్తూ, మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినం ప్రారంభమైంది. యుగయుగాలుగా అణచివేతకు గురైన మహిళల  హక్కుల కోసం పోరాడడం, సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాగుతోంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది థీమ్ ను ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్: యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్’ అని నిర్ణయించింది. దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడుగే కీలకం అనే అర్థంలో ఈ  థీమ్ ను ఎంచుకున్నారు.

మహిళల హక్కులు, ఓటుహక్కు, మెరుగైన వేతనం, తక్కువ పనిగంటలు  సాధించేందుకు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటనతో 1909 ఫిబ్రవరి 28న తొలి జాతీయ మహిళా దినోత్సవం  జరుపుకున్నారు. ఇదో విప్లవాత్మక ముందడుగు. 1910 లో కోపెన్ హాగన్ లో జరిగిన అంతర్జాతీయ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్ సందర్భంగా వార్షిక మహిళా దినోత్సవాన్ని స్థాపించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఇది ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీంతో 1911 లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ లలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్, కంబోడియా, క్యూబా, మంగోలియా, రష్యా, ఉక్రేయిన్ తో  సహా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు 110 ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మహిళా దినోత్సవం కోసం మహిళలు సాగించిన పోరాటం ఓ చరిత్ర. 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రతి వెయ్యి మంది మహిళలకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వేలు వెల్లడించాయి.  అయితే దేశ జీడీపీలో పురుషుల కంటే మహిళలు వెనుకబడి ఉన్నారన్నది నిజం.  మనదేశంలో జీడీపీలో మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది.

మహిళలను ఆర్థికంగా బలోపేతం  చేసే లక్ష్యంతోనే ఐక్యరాజ్యసమితి  ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ను ప్రత్యేకంగా నిర్ణయించింది. అన్నిరంగాల్లో మహిళల పురోగతి వేగవంతం కావాలని, ఇందుకు  మహిళా సామర్థ్యాలను పెట్టుబడిగా వినియోగించాలని.. మహిళా  ప్రగతికి మహిళలే  స్పూర్తినిస్తూ  ముందుకు సాగాలని  ప్రపంచం కోరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News