- Advertisement -
మరోసారి పంజాబ్, హరియానా రైతులు ఢిల్లీ బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో మరోసారి ఆందోళన చేసేందుకు పంజాబ్, హరియానా రైతులు, రైతు సంఘాలు సిద్ధమయ్యారు. ఈనెల 13న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది.
రైతులను అడ్డుకునేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ప్రధాన రోడ్లపై పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రైతులు రోడ్లపైకి వస్తే.. ఎక్కడికక్యడే అడ్డుకునేలా కేంద్ర బలగాలను దింపుతోంది కేంద్ర సర్కార్. ఈ క్రమంలో హరియానాలోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వాయిస్ కాల్స్ కు మాత్రమే అనుమతిస్తూ.. ఇంర్నెట్, ఎస్ఎంఎస్ లను నిలిపివేసింది. ఈనెల 13వ తేదీ రాత్రి వరకూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -