జోథ్‌పుర్ : రంజాన్ పండగ వేళ.. రాజస్థాన్ లోని జోధ్‌పుర్‌లో అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపు లోకి తెచ్చేందుకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. ఈద్‌ను పురస్కరించుకుని జోధ్‌పుర్ లోని జలోరీ గేట్ వద్ద జెండాలను ఏర్పాటు చేసే విషయంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపి వేశారు. పోలీస్ బందోబస్తు నడుమ ముస్లిం సోదరులు ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతి కల్పించారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈద్ వేళ జోధ్‌పుర్‌లో అల్లర్లు.. ఇంటర్నెట్ నిలిపివేత
- Advertisement -
- Advertisement -
- Advertisement -