Wednesday, January 22, 2025

మణిపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మణిపూర్ లోని అయిదు జిల్లాల్లో ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించినట్టు హోంశాఖ కమిషనర్ ఎస్‌అశోక్ కుమార్ తెలిపారు. ఈ నెల 10 నుంచి ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ నెల 13 న బ్రాడ్ బ్యాండ్ సేవలను పాక్షికంగా ప్రారంభించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, బిష్ణుపుర్, తౌబాల్, కాచింగ్ జిల్లాల్లో ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News