Wednesday, January 22, 2025

ఇంటింటికీ నెట్

- Advertisement -
- Advertisement -

InterNet to house to house through T FIBER

టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్‌బాండ్

ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు, 12,751 గ్రామ
పంచాయతీల్లోని 83.5లక్షల
గృహాలకు హైస్పీడ్ బ్రాడ్‌బాండ్
సేవలు అందించాలన్నది లక్షం
భగీరథ పైప్‌లైన్ దారిలో 18వేల
కి.మీ. మేర, మిగిలిన 20వేల
కి.మీ. కేబుల్‌ను హైదరాబాద్
నుంచి మండలాలు, గ్రామ
పంచాయతీలకు నేరుగా..
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు,
విద్యుత్ సంస్థలకు ఎటువంటి
ఛార్జీలు చెల్లించకుండా ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : సాంకేతిక రంగంలో పెద్దఎత్తున మార్పు లు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇ అధిక ప్రాధాన్యతను ఇ స్తోంది. భాగంగానే దేశంలోనే మొట్టమొదటగా ఫైబర్ గ్రిడ్ పథకం (టి-ఫైబర్) ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేరంగా అడుగులు వేస్తోంది. సుమా రు నాలుగువేల కోట్ల రూపాయలతో కేం ద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైబర్‌గ్రిడ్ పథకానికి 2017లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృ హాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇందులో తొలి దశ పనులను ఏ ప్రిల్ చివరి నాటికల్లా పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకుంది.

వాస్తవానికి తొలి దశ పనులు ఇప్పటికే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ కరో నా కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ముగిసేలోగా మొదటి దశ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా పనులు జోరుగా సాగుతున్నాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కోసం భూసంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా ఐటి శాఖ ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ముందుకుసాగుతోంది. కేబుల్ వేసే బాధ్యతను స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇసిఐఎల్, ఎల్ అండ్‌టి సంస్థకు టెండర్ల ప్రక్రియ ద్వారా అప్పగించింది. కేబుల్‌ను భూగర్భంలో స్తంభా ల ద్వారా వేస్తున్నారు. రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పం చాయతీలు, గ్రామాలు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు కేబుల్ వేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. పిఎల్‌బి హెచ్‌డిఎఫ్‌ఇ (హైడెన్సిటి పాలిఇథైలిన్) పై పుల ద్వారా ఒఓఎఫ్‌సిని 38 వేల కిలోమీటర్ల పొడవున వేస్తున్నారు. ఈ సేవలను కేవలం గ్రామాలకే కాకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని ఇ టీవల రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల పరిధిలో కూడా ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ 23 మిలియన్ల మంది ప్రజలకు ప్రభుత్వం నుండి సేవలను, ఇతర అప్లికేషన్ల పరిధిని అనుసంధానం చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మందికి టెలిమెడిసిన్, విద్యా అవకాశాలను అందించడం ద్వారా ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ పథకం ద్వారా గృహాలకు 4-100 ఎంబిపిఎస్, సంస్థలు ఆన్-డిమాండ్ 20-100 ఎంబిపిఎస్ ఇంటర్నెట్‌ను అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ సేవలను అందిస్తోంది.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రైతు వేదికలకు కూడా ఫైబర్ కనెక్టివిటీని కూడా అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే పలు రైతు వేదికలకు కనెక్టివిటీని కల్పించారు.

ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం విధానం పెరిగింది. ఈ నేపథ్యంలో క్రమంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2020 మార్చిలో 68.74 కోట్ల మంది వినియోగదారులుండగా డిసెంబర్ నాటికి వారి సంఖ్య 74.74 కోట్లకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు పెరిగాయి. ఏప్రిల్ నుంచి జూన్ 2020 కాలానికి పల్లెల్లో 2.60 కోట్ల కనెక్షన్లు ఉండగా జులై- నుంచి సెప్టెంబరు కాలానికి ఆ సంఖ్య 2.66 కోట్లకు పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూసినప్పుడు ఇదే కాలానికి కనెక్షన్ల సంఖ్య 5.91 కోట్ల నుంచి 6.10 కోట్లకు చేరింది. వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా మహారాష్ట్ర సర్కిల్ తరువాత ఎపి, తెలంగాణ ఉమ్మడి టెలికం సర్కిల్ రెండో స్థానంలో ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద మందిలో 67.69 శాతం మందికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు రైట్ ఆఫ్ వే అధికారాలు

18 వేల కిలో మీటర్ల మేర కేబుల్‌ను మిషన్ భగీరథ పైపులైను దారిలో, మిగిలిన 20 వేల కిలోమీటర్ల కేబుల్‌ను స్టేట్ హెడ్‌క్వార్టర్ నుంచి మండలాలు, గ్రామపంచాయతీలకు వేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశ కింద 50 వేల కిలో మీటర్ల కేబుల్‌ను గ్రామ పంచాయతీల నుంచి గృహాలకు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రైట్ ఆఫ్ వే అధికారాలు కల్పించింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కేబుల్ వేసే వెసులుబాటును కార్పొరేషన్‌కు రైట్ ఆఫ్ వే కింద ప్రభుత్వం కల్పించింది. ఏరియల్ కేబుల్‌కు సంబంధించి విద్యుత్ సంస్థలకు కూడా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలకు చెందిన స్తంభాలు, సబ్‌స్టేషన్లను అనుమతి తీసుకోకుండానే వాడుకోవచ్చని ప్రకటించింది. టి -ఫైబర్ సంస్థ ఏర్పాటు చేసే ‘పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్(పిఒపి)లకు డిస్కంలు అత్యంత ప్రాధాన్యంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఫైబర్ గ్రిడ్ నెట్‌వర్క్ పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాలు స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News