Monday, December 23, 2024

ఉస్మానియా యూనివర్సిటీలోని సిఎఫ్‌ఆర్‌డిలో రీసెర్చ్ టెక్నిక్స్‌పై ఇంటర్న్‌షిప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు ప్రపంచ స్థాయి పరిశోధనలతో పాటు వారి ఉపాధిని మెరుగుపరిచే శిక్షణా కార్యక్రమాల ప్రాముఖ్యత ఇవ్వాలని హెచ్‌సిడిసి డైరెక్టర్ సీనియర్ ప్రొఫెసర్ స్టీవెన్‌సన్ కోహిర్ పేర్కొన్నారు. సోమవారం ఓయూలోని సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ టెక్నిక్స్‌పై మొదటి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. సైన్స్‌లో ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ కోసం విద్యార్థులకు అత్యాధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడానికి వారం రోజుల పాటు నిర్వహిస్తుంది.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టుపక్కల పరిశోధకులకు సాంకేతిక సహాయాన్ని అందించడంలో సిఎఫ్‌ఆర్ సహకారాన్ని వివరిస్తూ నామమాత్రపు ఛార్జీలతో సైన్స్‌లో ఉన్నత స్థాయి పరిశోధనలు చేయాలనుకునే ఎవరికైనా భవనం వద్ద సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ మొదలైనవి ప్రోగ్రామ్ సందర్భంగా, సీనియర్ ప్రొఫెసర్ గ్రేడ్‌కి పదోన్నతి పొందినందుకు అభినందించారు ఓయూలోని మైక్రోబయాలజీ విభాగంలో కోఆర్డినేటర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ హమీదా బీ ఓయూలోని హెచ్‌సిడిసి కోఆర్డినేటర్ డాక్టర్ పి మురళీధర్ రెడ్డి లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ మరియు అనుబంధ సబ్జెక్టుల కోసం కార్యక్రమంలో నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యకలాపాల గురించి తెలియజేశారు. విద్యార్థులకు అత్యాధునిక పరిశోధన ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు ఇటువంటి ఇంటర్న్‌షిప్‌లను భవిష్యత్తులో తరచుగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ విద్యార్థులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది విద్యార్థుల ఉపాధిని మెరుగుపరుచడంతో పాటు వారిని పరిశ్రమకు సిద్ధం చేస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News