Wednesday, January 22, 2025

స్కిల్ కేసులో 12 మంది ఐఏఎస్ లనూ విచారించండి!

- Advertisement -
- Advertisement -

సిఐడికి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు!!

మన తెలంగాణ/హైదరాబాద్ : విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 12 మంది ఐఏఎస్ అధికారులను కూడా విచారించాలని న్యాయవాది ప్రసాద్ ఎపి సిఐడికి ఫిర్యాదు చేశారు. ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం, ఉదయలక్ష్మి, కెవి. సత్యనారాయణ, జయలక్ష్మి, సిసోడియా, అజయ్ జైన్, కృతిక శుక్లా, రవిచంద్ర, శామ్యూల్ ఆనంద్ కుమార్, అర్జున్ శ్రీకాంత్, రావత్ లను విచారించాలని కోరారు.

టిడిపి హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లో పనిచేసిన అధికారులను కూడా స్కిల్ కేసులో విచారణ పరిధిలోకి తీసుకు రావాలని న్యాయవాది ప్రసాద్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు, చెక్ పవర్‌తో సంబంధం ఉన్న అధికారులను కూడా విచారించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News