- Advertisement -
హైదరాబాద్: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 3 రింగ్ మెయిన్2కి సంబంధించి 1500 ఎంఎం డయా పైపులైన్‌పైన నీటి లీకేజీని అరికట్డడానికి 400 ఎంఎం బటర్‌ప్లై వాల్వ్‌ను మార్చాల్సి ఉంది. రేపు శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు మొత్తం 12 గంటల పాటు ఈపనులు కొనసాగుతాయి. బోడుప్పల్, చెంగిచర్ల, ఫీర్జాదిగూడ, సైనిక్‌పురి, అల్వాల్, మౌలాలి, లాలాపేట, తార్నాక, స్నేహపురి, కైలాస్‌గిరి, చర్లపల్లి పరిధి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి పేర్కొంది.
- Advertisement -