Monday, December 23, 2024

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరానికి సింగూరు నుంచి తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్‌కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి ఈనెల 7వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి 8 వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈసందర్భంగా 24 గంటలు పాటు సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న రిజర్వాయర్ పరిధి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు :
1. ఓ అండ్ ఎం డివిజన్ నం 3 : షేక్‌పేట, టోలిచౌకి, గోల్కొండ, బోజగుట్ట రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎం డివిజన్ నం 18 : గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచి రేవుల.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News