Friday, November 22, 2024

మంచినీటి సరఫరాకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైల్వేశాఖ సిద్దిపేట కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్‌లైన్ నిర్మిస్తుండటంతో ఆటంకం కలగకుండా నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా ఫేజ్1లో కొండపాక నుంచి ఘన్‌పూర్‌కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్‌కు పక్కకు మార్చాల్సి ఉంది. ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలవరకు పనులు జరుగుతున్నట్లు దీంతో పలు రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటర్ బోర్డు పేర్కొంది.

పూర్తిగా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, ఢిపెన్స్ కాలనీ, నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం రింగ్‌మెయిన్ 3 ఆన్‌లైన్ సప్లై, కొంపల్లి, గుండ్ల పొచంపల్లి, అదే విధంగా ఆర్‌డబ్లూ ఆప్ టేక్ ప్రాంతాలైన కొండపాక, ప్రజ్ఞాపూర్, ఆలేర్, ఘన్‌పూర్, కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు..

పాక్షికంగా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట, ఎల్లారెడ్డి గూడ, యూసుప్‌గూడ, కెపిహెచ్‌బి, మలేషియా టౌన్‌షిప్, లింగంపల్లి, కొండాపూర్, గోపాల్‌నగర్, మయూర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉండటంతో వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News