- Advertisement -
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటలపాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్‌లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్, షాపింగ్ సమస్యలు, ప్రైమ్ వీడియో సేవలకు అంతరాయం లాంటి ఫిర్యాదులతో ట్విటర్ మారు మోగింది.
ఇండియాతో పాటు యుకె, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్‌లోని పలు కస్టమర్లు అమెజాన్ డౌన్ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్ స్పందించింది. ఇబ్బందులు తలెత్తిన మాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. అయితే, సేవల అంతరాయానికి గల కారణాలను స్పష్టం చేయలేదు.
- Advertisement -