మనతెలంగాణ, హైదరాబాద్ : ఖరీదైన బైక్‌లను చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు బాలురు ఉండగా, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి ఏడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, యమహాబైక్, ఐదు బజాజ్ పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.17లక్షలు ఉంటుంది. ఈస్ట్‌జోన్ డిసిపి చక్రవర్తి గుమ్మి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, బీదర్ జిల్లా, మనకేళి పిఎస్, చిటుగుప్ప గ్రామానికి చెందిన మహ్మద్ మహబూబ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇద్దరు బాలురు చోరీ చేసిన బైక్‌లను విక్రయిస్తున్నారు. కర్నాటక, బీదర్,మనకేళికి చనెందిన అజహర్, ఫైసల్, సల్మాన్ పరారీలో ఉన్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఖరీదైన బైక్‌లను చోరీ చేస్తున్నారు. నిందితులపై అఫ్జల్‌గంజ్‌లో రెండు కేసులు,చాదర్‌ఘాట్, మియాపూర్, సనత్‌నగర్, పిఎస్ కోహీర్‌లో రెండు కేసులు, సదాశివపేటలో రెండు, జహీరాబాద్‌లో ఒక కేసు నమోదైంది.
నిందితులు గత నెల16, 29వ తేదీన నగరంలోని గౌలిగూడలో పార్కింగ్ చేసిన రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 100 సిసిటివిల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితులను గుర్తించి బీదర్‌కు చెందిన అజహర్, ఫైసల్, సల్మాన్, మహ్మద్ మహబూబ్‌గా గుర్తించారు. ఇందులో మహబూబ్‌ను అఫ్జల్‌గంజ్ పోలీసులు పట్టుకున్నారు. అందరు నిందితులు వ్యసనాలకు బానిసలుగా మారారు. నిందితులు అందరు కలిసి రాత్రి సమయంలో తిరుగుతూ ఖరీదైన బైక్‌లను కనిపెడతారు. వాటిని డూప్లికేట్ తాళం చెవులతో చోరీ చేసి తీసుకుని వెళ్తారు. వాటిని ఇద్దరు మైనర్లకు రూ.20,000, 30,000లకు విక్రయిస్తున్నారు. వాటిని బాలురు అమాయకులకు ఫైనాన్స్ సంస్థలు సీజ్ చేసిన బైక్‌లని చెప్పి విక్రయిస్తున్నారు. తర్వాత బైక్‌కు సబంధించిన కాగితాలు ఇస్తామని వారికి చెబుతున్నారు. తాండూరు సమీపంలోని వారికి ఇప్పటి వరకు 5 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, రెండు బజాజ్ పల్సర్ బైక్‌లను విక్రయించారు. మిగతా వాటిని అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు రవీందర్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.