Monday, November 18, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రామచంద్రాపురం: ఇతర ప్రాంతాల నుంచి నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకువచ్చి అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్టి (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్), రామచంద్రాపురం పోలీసులు వల పన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా వీరిలో ప్రధాన నిందితుడు పారిపోయాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాదాపూర్ డిసిపి శిల్పపల్లి పూర్తి వివరాలను వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన గంజాయిని ప్యాకెట్లుగా చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ప్రతీం రే(22), విద్యుత్ రే(24) మాదకద్రవ్యాలను వాహనాల్లో తరలిస్తుంటారు. కాగా అదే ప్రాంతానికి చెందిన రాజేశ్ జైన్ (29) కొల్లూరులోని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతంలో లేబర్‌గా పనిచేస్తుంటాడు.

కొద్ది నెలల క్రితమే కొల్లూరుకు వచ్చిన రాజేశ్ జైన్ వృత్తి కూలి పని కాదని, కూలి పని చేస్తున్నట్టు నమ్మిస్తూ గంజాయి అమ్ముతుంటాడని పేర్కొన్నారు. ప్రీతం దీపాన్‌కర్ మల్కాజిగిరిలో ఉంటూ గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి దీనిని తీసుకుని దీపాన్‌కర్‌తో కలిసి వివిధ ప్రాంతాలకు సపై చేస్తుంటాడన్నారు. విద్యుత్ రే వీరిద్దరితో కలిసి గంజాయిని వివిధ ప్రాంతాలకు ఇక్కడ అక్రమంగా తరలిస్తుంటాడని తెలిపారు. రాజేశ్ జైన్ కూలీ పని చేస్తూన్నట్టు నటిస్తూ దీపాన్‌కర్, ప్రీతం రే, విద్యుత్ రేలు తీసుకువచ్చే నిషేదిక గంజాయిని స్థానికంగా ఉండే వారికి రహస్యంగా అమ్ముతుంటాడని డిసిపి శిల్పవల్లి వెల్లడించారు. ఇదే విధంగా ఈనెల 7న 120 కిలోల గంజాయిని 60 ప్యాకెట్లలో రెండేసి కిలోల చొప్పున ప్యాక్ చేసి రెండు కార్లలో దీపాన్‌కర్, బిద్యుత్ రేలు తీసుకుని హైదరాబాద్కు వస్తుండగా, వారికి ముంద ప్రీతంరే పల్సర్ బైక్‌పైన ఎస్కార్ట్‌గా బయలుదేరాడు.

ఈ సమాచారాన్ని అందుకున్న రామచంద్రాపురం, మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు ఏప్రిల్ 8న ఉదయాన్నే కొల్లూరులో మాటువేశారు. కొద్దిసేపటి తర్వాత కొల్లూరులో రాజేశ్‌జైన్ నివశిస్తున్న లేబర్ ఇళ్ల వద్దకు దీపాన్‌కర్, ప్రీతం రే, విద్యుత్ రేలు గంజాయితో పాటు వచ్చి అందజేస్తుండగా రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్ సంజయ్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని పట్టుకుని 120 కిలోల గంజాయితో పాటు వారు రెండు కార్లు, ఒక బైక్, నాలుగు సెల్‌ఫోన్లు మొత్తం రూ.50 లక్షల 90వేల విలువ చేసే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ప్రధాన నిందితుడు దీపాన్‌కర్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడని శిల్పవల్లి తెలిపారు.

మిగిలిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిదన్నారు. వీరు గంజాయిని నాలుగు వేల రూపాయలకు కిలో చొప్పున అక్కడి నుంచి తీసుకువచ్చి 30 వేల అమ తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డిసిపి శిల్పవల్లి రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్ సంజయ్, ఎస్టి ఇన్‌స్పెక్టర్ శివకుమార్లను వారి బృందాన్ని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News