Tuesday, November 5, 2024

అంతరాష్ట్ర డ్రగ్స్ సప్లయ్‌దారుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

interstate drug supplier arrested in hyderabad

4కిలోల ఓపియం, రూ.2లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి 4కిలోల ఓపియం డ్రగ్స్, రూ.2లక్షల నగదు, మోటార్‌సైకిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సిపి మహేష్ భగవత్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, బిల్లాడ్ తహసిల్, పిప్పాడ్ గ్రామానికి చెందిన ఓంప్రకాష్ పటేల్ వ్యాపారం చేస్తూ నగరంలోని చందానగర్, పిజేఆర్ కాలనీలో ఉంటున్నాడు.

రాజస్థాన్‌కు చెందిన గిరిధారి పరారీలో ఉన్నాడు. వ్యాపారం చేస్తున్న ఓంప్రకాష్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. విలాసాలకు డబ్బులు లేకపోవడంతో ఓపియంను విక్రయించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే గిరిధారితో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాధించాలని ప్లాన్ వేశాడు. రాజస్థాన్‌లో ఓపియంను కిలోకు రూ.1,30,000లకు కొనుగోలు చేస్తున్నాడు. ఇక్కడ అవసరం ఉన్న వారికి రూ.6 నుంచి రూ.8లక్షలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిపై నిఘాపెట్టాడు. బస్సులో ఓపియం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, మన్మోహన్, ఎస్సై రాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News