Saturday, November 2, 2024

అంతరాష్ట్ర డ్రగ్ సరఫరా ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

అంతరాష్ట్ర డ్రగ్ సరఫరా ముఠా గుట్టును ఎల్‌బినగర్ ఎస్వోటీ, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. రెండు కార్లలో పెద్ద మొత్తంలో ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీ సులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 280 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అబా మచింద్ర, శివాజీ రాథోడ్, సిద్ద రామేశ్వర్ ఇంటర్ వరకు చదవుకున్నారు. ముగ్గురు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపా దిం చాలని గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముగ్గురు ముఠా సభ్యులు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ ముగ్గురు కామన్ ఫ్రెండ్ మహారాష్ట్రకు చెందిన అజయ్ రాథోడ్‌తో కలిసి ఈ దందాకు గతంలోనే తెరలేపారు.

అదే క్రమంలో తక్కువ రేటుతో అక్కడ గంజాయి కొని దానిని అధిక మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇదే క్రమంలో ఈజీ మనీకి వారు బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అజయ్ రాథోడ్ మిగతా ముగ్గురితో కలిసి ఒడిశాకు చెందిన గంజాయి సరఫరాదారు తేజ కాంటాక్టు అయ్యారు. వీరు గంజాయి కొనుగోలు చేసేందుకు అవసరమైన సొమ్ములు రెడీ చేసుకుని తేజ వద్ద నుంచి రూ.280 కెజిల గంజాయిని కొను గోలు చేశారు. రెండు కార్లలో నకిలీ నెంబర్ ప్లేట్‌లతో గంజాయిని ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలించే ప్రయత్నంలో పతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News