Sunday, December 22, 2024

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

interstate thief arrested in hyderabad

నిందితుడిపై 20కేసులు
అరెస్టు చేసిన ఎల్‌బి నగర్ పోలీసులు

హైదరాబాద్: ఇళ్లల్లో చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ఘరానా దొంగను ఎల్‌బి నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 220 గ్రాముల వెండి వస్తువులు, రూ.1లక్ష నగదు, రెండు బైక్‌లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.4,65,650 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని కడప జిల్లా, చిన్నచౌక్ పోస్టు, అశోక్‌నగర్‌కు చెందిన బ్రహ్మదేవి రాజశ్రీ గణేష్ అలియాస్ రాజయ్య అలియాస్ విజయ్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సిఐబి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిని నిందితుడు ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు. ఎపి, తెలంగాణ రాష్ట్రంలో పలు ఇళ్లల్లో చోరీలు చేశాడు. పోలీసులు నిందితుడిని గతంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలులో పలువురు దొంగలను కలిశాడు, తనకు బెయిల్ ఇప్పిస్తే చోరీలు చేసినదాంట్లో 40శాతం ఇస్తానని నమ్మించాడు.

నిందితుడిపై పోలీసులు 2021లో పిడి యాక్ట్ పెట్టారు. నిందితుడు బైక్‌పై పగటి సమయంలో కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తాడు. చోరీ చేయాల్సిన ఇళ్లను గుర్తుపెట్టుకుని రాత్రి సమయంలో చోరీలు చేస్తాడు. ఈ క్రమంలోనే నిందితుడు మార్చి,7వ తేదీన ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్‌టైన్ కాలనీలోని ఇంట్లో చోరీ చేశాడు. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేశాడు. వాటితో ఓఎల్‌ఎక్స్‌లో కారును కొనుగోలు చేసి దానిలో తిరుగుతున్నాడు. తర్వాత బంజారాహిల్స్, కర్నాటకలోని బళ్లారి, ఎపిలోని పొద్దుటూరులో చోరీలు చేశాడు. ఇలా పలు దొంగతనాలు చేయడంతో రాచకొండ పరిధిలో ఎల్‌బినగర్, భువనగిరి టౌన్, ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్, కెపిహెచ్‌బి, నాగారం పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన ఎల్‌బి నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News