Wednesday, January 15, 2025

అంతరాష్ట్ర దోపిడీ మహిళా ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

షాపింగ్ చేస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేస్తున్న ఐదుగురు మహిళల అంతరాష్ట్ర ముఠాను సుల్తాన్‌బజార్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2,000 నగదు, 35 శారీలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్, తెహిసిల్ పచోరే, గ్రామ్ గుల్ కేడికి చెందిన సబానా, కుంతిబాయి, రిహానా, నినో బాయి, మందాకిని సిసోడియా కలిసి దృష్టిమరల్చి చోరీలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఐదుగురు మహిళలు ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని సితారా లాడ్జిలో బస చేశారు.

అక్కడి నుంచి నగరంలోని షాపింగ్ మాల్స్, రద్ది ఉండే ప్రాంతాలకు వెళ్లి చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి వచ్చిన మహిళ సుల్తాన్ బజార్‌లో దుస్తుల దుకాణంలో షాపింగ్ చేస్తుండగా ఐదుగురు మహిళల ముఠా అక్కడికి వెళ్లారు. బాధిత మహిళ షాపింగ్ బిజీలో ఉండగా ఆమె వద్ద ఉన్న రూ.16,000 నగదు, గ్రీన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డును చోరీ చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దాదాపు 200 సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఇన్స్‌స్పెక్టర్ మధుకుమార్, ఎస్సై నరేష్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News