Saturday, November 23, 2024

నేను చాలా లక్కీ

- Advertisement -
- Advertisement -

Interview with Actor Venkatesh

 

విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నారప్ప’. ఇది తమిళ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ’అసురన్’ చిత్రానికి రీమేక్. వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్.థాను, – సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంఅమెజాన్ ప్రైమ్ వేదికగా ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అది మాత్రమే ఆలోచిస్తా…

‘నారప్ప’ సినిమా చాలా బాగా వచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అని చెప్పారు… ఓకె అన్నాను. ఎందుకు అనే ప్రశ్న జీవితంలో ఉండకూడదు అని ఫీలవుతుంటాను. అందుకే ఎందుకు అని ఎవరినీ అడగను. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అనే కాదు. ఒకప్పుడు సెంటర్స్ గురించి కూడా ఫ్యాన్స్ అడిగే వారు. కానీ నేను ఆ సైడ్ ఎక్కువ పట్టించుకోను. నటుడిగా వచ్చిన క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను. ఏదైనా ఒక పని చేసినప్పుడు సమయమే తప్పో ఒప్పో చెబుతుంది అని నమ్ముతాను.

అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా…

‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ అని ప్రకటించగానే నా ఫ్యాన్స్ కొంత మంది బాధ పడ్డారు. కొందరు సంతోషపడ్డారు. కానీ ఎక్కువ మంది నిరాశచెందారు. అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. కానీ ఫ్యాన్స్ ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ నటుడిగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. అభిమానులు మొదట్లో కొంత బాధ పడ్డా తర్వాత అర్థం చేసుకున్నారు. వాళ్ళు ‘నారప్ప’ను చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

ఛాలెంజింగ్‌గా…

తమిళ్‌లో వెట్రిమారన్ , ధనుష్ కలిసి ఆడియన్స్‌కి ఓ మంచి సినిమా అందించారు. ‘అసురన్’ ఓ క్లాసిక్ సినిమా. వండర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో ఓ మెసేజ్ ఇచ్చారు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామా ఉంది. చూడగానే చాలా నచ్చింది. తప్పకుండా ఇలాంటిది చేస్తే బాగుంటుంది.. నాకో ఛాలెంజింగ్‌గా ఉంటుందనిపించింది. అందుకే ఈ రీమేక్ ఎంపిక చేసుకున్నాను. నా కెరీర్‌లో చాలా రీమేక్స్ చేశాను. కొన్ని సార్లు ఇక్కడ ఆ సినిమా చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటివి కొన్ని చూసినప్పుడు వెంటనే రీమేక్ చేయాలనిపిస్తుంది. అలాంటి ఓ కథే ఈ ‘నారప్ప’.

ఇలాంటిది చేసినందుకు గర్వపడుతున్నా…

‘నారప్ప’ నటుడిగా నాకో పెద్ద ఛాలెంజ్. గెటప్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్ నేనిప్పటి వరకు చేయలేదు. పైగా చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ యాక్షన్ మిక్స్ అయిన సినిమా చేశాను. యాక్షన్ , ఎమోషన్ రెండూ సహజంగా ఉంటాయి. షూట్ జరిగనంత సేపు అదే డ్రెస్ తో ఉన్నాను. నటుడిగా ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను.

మంచి అవుట్‌పుట్…

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన బాధ్యతని చక్కగా నిర్వర్తించి మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చాడు. అతను కూడా ఛాలెంజింగ్‌గా తీసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేశాడు.

నేను చాలా లక్కీ…

ఒకేసారి బ్యాక్- టు -బ్యాక్ మూడు సినిమాలు చేయడం చాలా లక్కీ అని భావిస్తున్నాను. నేను ఏ సినిమా షూటింగ్ చేసినా వెంటనే ఆ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తాను. కెరీర్ ప్రారంభం నుంచి నేను అంతే. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు వేటికవే ప్రత్యేకమైనవి. అలా మూడు సినిమా చేయడానికి కుదిరినందుకు నేను లక్కీ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News