Friday, November 15, 2024

పల్లెటూరి ఫీల్‌ను కలిగించే పాటలు

- Advertisement -
- Advertisement -

Interview with Anoop Rubens

 

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున ఒక పాటను ఆలపించడం విశేషం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడుతూ “నాగార్జునతో సినిమా చేయడం ప్రోత్సాహంగా ఉంటుంది. ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. నాగార్జునతో నేను ఇంతకుముందు చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. ఇంతకుముందు చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో నాపై కాస్త ఒత్తిడి సహజంగా ఉంది. దీంతో ఈ సినిమాకు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని మంచి సంగీతాన్ని అందించాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున ‘డిక్కడిక్కడుండుం…’అనే పాట పాడారు. ఆ పాటను ప్రేక్షకులు ఆదరించారు. దానికి కొనసాగింపుగా ‘బంగార్రాజు’లో కూడా నాగార్జున పాట పాడారు. ఈ పాట పాత్ర పరంగా, సందర్భానుసారంగా ఉంటుంది. గ్రామీణ కథతో తెరకెక్కిన చిత్రమిది. దీంతో ఇందులో ఏ ఒక్క పాటకు కూడా పాశ్యాత్య వాయిద్యాలు వాడలేదు. పాటలన్నీ పల్లెటూరి ఫీల్‌ను కలిగిస్తాయి. బ్లాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక నేను చేసిన ‘శేఖర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత విక్రమ్ కె.కుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News