హైదరాబాద్ : ఈ నెల 20న ఇన్ స్పైర్-2023 సివిల్ సర్వీస్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిసి ఎంప్లాయబిలిటి స్కిల్ డెవలప్‌మెంట్, ట్రేనింగ్ సెంటర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కుటుంబ నేపథ్యం ఏదైనా పట్టు దల, వ్యూహం ఉుంటే సివిల్ సర్వీసెస్ సాధిుంచటం సాధ్యమేనని నిరూపిుంచిన సివిల్ సర్వీస్స్, 2022 విజేతలతో బిసి సుంక్షేమ శాఖ, టిఎస్‌బిసి స్టడీసర్కిల్, హ ైదర్‌ాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ సహకారుంతో ముఖాముఖి
కారయకరమాన్ని ఏర్పాటు చేయడుం జరిగిందని తెలిపారు.
ఇన్ స్పైర్ 2023 పేరుతో ఈ నెల 20న ఉస్మానియా విశ్వవిదాయలుంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బిసి సుంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండబోయిన రవీందర్ యాదవ్ గౌరవ్ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకుంటారని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారందరూ, ఉస్మానియా విద్యార్థులూ వినియోగించుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు బిసి స్టడీ సర్కిల్ అండగా ఉంటుందని, వారి కోసం ఇప్పటికే సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.