Monday, November 18, 2024

‘ఎఫ్ 3’లో వెంకటేష్, వరుణ్ యాక్టింగ్ ఇరగదీశారు

- Advertisement -
- Advertisement -

Interview with Director Anil Ravipudi

 

‘పటాస్’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు ఒకదానిని మించి మరొకటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అపజయమెరుగని దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో మరింత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరోహీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం అనిల్ రావిపూడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

అదే ఈ బర్త్ డే ప్రత్యేకత…

డైరెక్టర్ అయ్యాక ఇది నా ఆరవ బర్త్ డే. ఇంకా ఎంతో ప్రయాణించాల్సి ఉంది. బర్త్ డే అయినా కూడా ఎఫ్ 3 సెట్లో పని చేస్తున్నాను. అదే ఈ బర్త్ డే ప్రత్యేకత. ఎఫ్ 2 సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో అంతకుమించి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సారి కూడా సంక్రాంతికి వస్తే హ్యాట్రిక్ అయ్యేది. కానీ పెద్ద ఎత్తున విడుదల చేయాలని, సోలో రిలీజ్ చేయాలని సంక్రాంతి నుంచి తప్పుకున్నాం.

యాక్టింగ్ ఇరగదీశారు…

-‘ఎఫ్ 2’ సినిమా భార్యభర్తల మధ్య ఉంటుంది. కానీ ‘ఎఫ్ 3’ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత పాత్రలన్నీ ఉంటాయి. ఇందులో కొన్ని కొత్త పాత్రలు జత చేశాం. సునీల్, మురళీ శర్మ పాత్రలను కొత్తగా తీసుకున్నాం. ‘ఎఫ్ 2’ వల్ల వచ్చిన కిక్కో, ఎనర్జీవల్లో కానీ ‘ఎఫ్ 3’లో వెంకటేష్, వరుణ్ తేజ్ యాక్టింగ్ ఇరగదీశారు.

డిసెంబర్‌కల్లా పూర్తి…

‘ఎఫ్ 3’- సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి. కొంత టాకీ పార్ట్ కూడా ఉంది. డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ పూర్తవువుతుంది.

దాన్ని బ్రేక్ చేశాం…

-నా ప్రతి సినిమాలో ఏదో ఒక మ్యానరిజం ఊంటూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం దాన్ని బ్రేక్ చేశాం. అంతేగా అంతేగా, వెంకీ ఆసనం అక్కడక్కడా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఎక్కువగా సందర్భాన్ని బట్టి మంచి సన్నివేశాలు ఉంటాయి. – ఎఫ్ 2 అనేది నా బయోపిక్. మగాళ్లందరి బయోపిక్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అలా ఫ్రస్టేట్ అవుతుంటారు. పని చేసే చోట, ఇంట్లో… ఇలా ఎక్కడైనా సరే ఫ్రస్ట్రేట్ ఉంటుంది. దానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’తో రావడం ఆనందంగా ఉంది.

ఈసారి పాటలో కనిపిస్తా…

-ఎఫ్ 2 సినిమాలో నేను చివరలో కనిపిస్తాను. ఈ సారి పాటలో కనిపిస్తాను. డ్యాన్సులు అయితే ఇప్పుడప్పుడే చేయను. భాస్కర భట్ల రాసిన లడ్ డబ్… అనే సాంగ్‌ను ఈ మధ్యే షూట్ చేశాం. అందులో అందరం కనిపిస్తాం.

బాలకృష్ణ స్టైల్‌కు తగ్గట్టుగా…

-సరిలేరు నీకెవ్వరు సినిమా దేశభక్తిని చాటుతూ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. బాలకృష్ణతో చేయబోయే సినిమా ఆయన స్టైల్‌కు తగ్గట్టుగా ఉంది. అది కూడా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా కాదు. బాలకృష్ణతో చేయబోయేది కొత్త కథ. ఈ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నాను. జనవరి నుంచి ఈ కథ మీదే కూర్చుంటాను. జూన్, జూలై సెట్స్ మీదకు వెళ్తాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News