Friday, November 8, 2024

కమర్షియల్ బయోపిక్‌లా ‘తెలంగాణ దేవుడు’

- Advertisement -
- Advertisement -

Interview with Director Vadthya Harish

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి వడత్యా హరీష్ దర్శకుడు. మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వడత్యా హరీష్ మీడియాతో మాట్లాడుతూ “మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రానికి 1969 నుంచి కథను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ చిన్నతనం నుండి మొదలుకొని తన కాలేజ్ లైఫ్, ఉద్యమం, సీఎం వరకు కథ సాగుతుంది. కేసీఆర్ జీవితం గురించి ఫ్రెష్‌గా చెబుతున్నానని భావించి కమర్షియల్ బయోపిక్‌లా సినిమాను చేయడం జరిగింది. ఇందులో సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆయనకు సాహిత్యం పట్ల అవగాహన ఉంది కనుకే ‘జై బోలో తెలంగాణ’లో ఓ పాట కూడా రాయడం జరిగింది.

అంతేకాదు ఆయన ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాలు కూడా చూసేవారు. అందుకే ఆ తరహాలో ఆయనను చూపించడం, పాటలు పెట్టడం కూడా జరిగింది. చూసే ఆడియన్స్‌కు కూడా మరీ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలగనీయకుండా ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ కామెడీ ఉండాలి అని ఆలోచించి పెట్టడం జరిగింది. కథ అనుకున్నప్పుడే శ్రీకాంత్‌ని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. అయితే శ్రీకాంత్ చిన్నప్పటి పాత్ర అనుకోగానే జిషాన్ అందుకు పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే శ్రీకాంత్ హైట్, కలర్. బాడీ లాంగ్వేజ్ అన్నీ జిషాన్‌లో కనిపించాయి. ఈ సినిమా ఫస్టాఫ్‌లో శ్రీకాంత్ పాత్ర ఉంటుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌లో చిన్ననాటి పాత్ర ఉంటుంది. అప్పుడే జిషాన్ పాత్ర మొదలవుతుంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News