Saturday, December 21, 2024

గీత గోవిందం, పోకిరి.. కలిపితే ‘సర్కారు వారి పాట’లా ఉంటుంది

- Advertisement -
- Advertisement -

Interview with Editor Marthand K. Venkatesh

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ’సర్కారు వారి పాట’ విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ “దర్శకుడు పరశురాం సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ ‘సర్కారు వారి పాట’లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో ‘సర్కారు వారి పాట’ అలా వుంటుంది. ‘పోకిరి’కి మించి ‘సర్కారు వారి పాట’ హిట్ అవుతుంది. నేను చేసిన సినిమాలన్నింటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా ఉంటారు.

ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్‌కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్‌ఫుల్‌గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్‌తో అదిరిపోతుంది. ఇందులో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. హీరోయిన్ పాత్ర చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి మనకీ ఉంటే బావుండనిపిస్తుంది. హీరో పాత్రతో కనెక్ట్ అవుతాం. ఎడిట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేస్తాం. ఎడిట్ చేస్తున్నపుడు ‘సర్కారు వారి పాట’కి అద్భుతంగా కనెక్ట్ అయ్యాం. సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇక నేను ఇప్పటి వరకూ 450 సినిమాలు చేశాను. మహేష్‌తో రాజకుమారుడు, టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’కి చేశాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News