Thursday, January 23, 2025

ఛాలెంజింగ్‌గా అనిపించింది

- Advertisement -
- Advertisement -

Interview with Hero Ashok Galla

 

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు..

అంతకంటే ఆలోచించలేదు…

కమర్షియల్ సినిమా చేస్తున్నామని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ముందే చెప్పారు. ఎక్కువగా ఆయన నాకు చిరంజీవి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు. సెట్‌లో దర్శకుడు ఏది చెబితే అది చేశాను. ఆయన ఓకే అన్నారా? లేదా? అని మాత్రమే చూశాను. అంత కంటే ఎక్కువగా నేను ఆలోచించలేదు.

అది నా అదృష్టం…

నేను శ్రీరామ్ ఆదిత్యని దర్శకుడిగా ఎంచుకోలేదు. మేం ఇద్దరం ఒకరినొకరు ఎంచుకున్నాం. ఇద్దరం కలిసి సినిమాను చేయాలని అనుకున్నాం. ఆయన నన్ను హీరోగా ఎంచుకోవడం నా అదృష్టం. నన్ను చూశారు.. ‘అబ్బాయి నచ్చాడు’ అని చెప్పారు. ఏ సినిమాలు ఇష్టమని అడిగారు. అలా ఓ ఆరు గంటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరకు ఈ సినిమా చేసేద్దామని అన్నారు.

చివరి నిమిషంలో…

ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో కావాలని అనుకుంటాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనమే తోపు అనుకునే ఆ క్యారెక్టర్‌లో నటించాను. దర్శకుడు ఈ సినిమాకు కమర్షియల్ ఫార్మాట్ అద్దారు. కానీ ఇందులో కాన్సెప్ట్ ఉంటుంది. సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. సంక్రాంతికి రావాలని చివరి నిమిషంలో నిర్ణయించుకున్నాం.

అది ఛాలెంజింగ్‌గా…

ఈ సినిమా కంటే ముందు నాకు హార్స్ రైడింగ్ రాదు. కౌబాయ్ గెటప్ చెప్పినప్పుడు నాకు హార్స్ రైడింగ్ రాదని చెప్పాను. పర్లేదు అని డైరెక్టర్ అన్నారు. కానీ షూటింగ్‌కు వెళ్లే నెల ముందు మళ్లీ చెప్పారు. గుర్రం ఎక్కితే బాగుంటుందని డైరెక్టర్ అన్నారు. దీంతో హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. అది ఛాలెంజింగ్‌గా అనిపించింది.

ఎలా ఉండాలో చెప్పారు…

నాకు నటనపై ఆసక్తి ఉందని మహేష్ బాబుకి ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాను. కానీ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నానని తెలియడంతో సీరియస్‌గానే చెప్పాడని అనుకున్నారు. ఇక్కడకు వస్తే ఎలా ఉండాలి.. ఎలా ధైర్యంగా ఉండాలి అనేదే మహేష్ ఎక్కువగా చెప్పారు.

అప్పుడు ఏమీ గుర్తుకు రాదు…

ఈ సినిమాలో ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ ఉండవు. కామెడీ, ఫైట్స్ ఎలా చేశానో.. ఎమోషనల్ సీన్‌లోనూ అలాగే నటించాను. నాకు కెమెరా ముందే కంఫర్ట్‌గా అనిపిస్తుంది. కెమెరా ముందున్న ఆ కొన్ని నిమిషాలు ఏమీ గుర్తుకు రాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News