Saturday, November 23, 2024

అందుకే ‘సుల్తాన్’ అని పెట్టాం

- Advertisement -
- Advertisement -

Interview with Hero Karthi

 

ఖైదీ, దొంగ వంటి హిట్ చిత్రాల తర్వాత కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్.ప్రకాష్‌బాబు, యస్.ఆర్.ప్రభు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తితో ఇంటర్వూ…

అందరూ ఎంజాయ్ చేసే…

ఈ సినిమాలో డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కుటుంబంలోని అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. అందుకే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.

అందుకే ఈ టైటిల్…

ఈ సినిమాలో మలయాళం నటుడు లాల్ నాకు గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ చేశాడు. అతను ఈ సినిమాలో ముస్లింగా కనిపిస్తాడు. అతనే నన్ను ముద్దుగా ‘సుల్తాన్’ అని పిలుస్తాడు. అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది.

గ్రామీణ అమ్మాయిగా…

రష్మిక ఈ సినిమాలో గ్రామీణ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. తనకి ఈ పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో ఆమె ట్రాక్టర్ నడపడం, పాలు పితకడం వంటి పనులన్నీ చేసింది. రష్మిక అద్భుతంగా నటించింది.

మరచిపోలేని అనుభూతి…

నేను నటిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా చేయడం మరచిపోలేని అనుభూతినిస్తోంది.

బాబు పుట్టాడు…

లాక్‌డౌన్ సమయంలోనే నాకు బాబు పుట్టాడు. అతనికి కందన్ అని పేరు పెట్టాను. కందన్ అంటే మురుగన్, కార్తికేయ స్వామి అని అర్థం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News