Sunday, November 17, 2024

అప్పుడు నేను ఎక్కడికో వెళ్లిపోయాను

- Advertisement -
- Advertisement -

Interview with Hero Karthikeya

 

యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తికేయతో ఇంటర్వూ విశేషాలు…

మరో మాట లేకుండా…

ఈ సినిమా అవకాశం 2019లోనే వచ్చింది. అలాగే అప్పుడే తెలిసింది… ఈ సినిమాను గీతా ఆర్ట్ వాళ్లు ప్రొడ్యూస్ చేస్తున్నారని. ఇక అంతే మరో మాట లేకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పాను. ఈ చిత్రం నా కెరీర్ కు ఖచ్చితంగా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నాను.

అది నాకు బాగా నచ్చింది…

నేను ఈ సినిమాలో శవాలని తీసుకెళ్లే ఓ వ్యాన్ డ్రైవర్‌గా కనిపిస్తాను. అలాంటి వ్యక్తి భర్తను పోగొట్టుకున్న అమ్మాయిని చూసి ప్రేమలో పడటం అనేది నాకు బాగా నచ్చింది. పైగా ఇలాంటి మాస్ రోల్ కూడా ఇంతవరకు చేయలేదు. దీంతో నేను ఈ సినిమాకు ఓకే చెప్పాను.

ఎక్కడికో వెళ్లిపోయాను…

నేను మొదటిసారి కౌశిక్‌ను చూసినప్పుడు గీతా ఆర్ట్ వాళ్లు ‘పెళ్లి చూపులు’ లాంటి కథను చెప్పడానికి పంపారని అనుకున్నా. కానీ ఒక్కసారి కౌశిక్ ‘చావు కబురు చల్లగా’ కథ చెప్పిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. ఇందులో ఉండే ఎమోషన్, ఫిలాసఫీలను కౌశిక్ చాలా బాగా చెప్పాడు.

ఆమె అయితేనే సరిపోతారని…

నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు తల్లి పాత్రలో ఎవరు చేస్తారు? అని అడిగాను. అప్పుడే అనుకున్నాము… ఆమని లాంటి లెజెండరీ నటి అయితేనే ఈ పాత్రకు సరిపోతారని. దాంతో ఆమె నాకు, మా డైరెక్టర్‌కు గౌరవం ఇచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నారు. ఇన్నేళ్లు అయినా కూడా ఆమని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు.

ఓ వరంలాంటిదే…

సీనియర్ నిర్మాత అల్లు అరవింద్‌ను మొదటిసారి కలిసినప్పుడు చాలా భయపడ్డాను. కానీ కలిశాక రియల్ లైఫ్‌లో ఆయన ఎంత చిల్‌గా ఉంటారో అర్ధమైంది. అలాంటి వారితో కలిసి పని చేయడం నా కెరీర్‌కు ఓ వరం లాంటిదే అని చెబుతా. ఇంకా ఆయనతో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను.

థ్రిల్లింగ్‌గా అనిపించింది…

కోలీవుడ్ స్టార్ అజిత్ సినిమాలో ఆఫర్ రాగానే ఎంతో సంతోషంగా ఈ సినిమాకు ఒప్పుకున్నా. అజిత్‌తో కలిసి పని చేయడం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆయనతో కలిసి సెట్స్‌లో ఉండడమే గొప్ప ఆశీర్వాదంగా భావించాను.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News