Monday, December 23, 2024

అసలు కథ అంతా వారితోనే

- Advertisement -
- Advertisement -

Interview with Hero Nagachaitanya

 

అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

కొంచెం టెన్షన్‌గా…

హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాన్న నాగార్జునతో కలిసి నటించేటప్పుడు కొంచెం టెన్షన్‌గా అనిపించింది. కానీ దర్శకుడు కళ్యాణ్ బాగా సహకరించారు. అలాగే నాన్న కూడా ఈ సినిమా విషయంలో బాగా సపోర్ట్ చేశారు.

అసలు కథ వారితోనే…

ఈ సినిమాలో నాకు, నాన్న పాత్రకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. నాన్నది గెస్ట్ రోల్‌లా ఏమీ ఉండదు. సినిమా అంతా ఉంటుంది. అసలు కథ అంతా కూడా నాన్న, రమ్య కృష్ణలతోనే ఉంటుంది.

పూర్తి వినోదాన్నిచ్చే…

ఈ సినిమాలో లాజికల్‌గా ఒక ట్రాక్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా యాడ్ అయింది. పైగా నాగలక్ష్మి రోల్‌కి, నాకు ఫన్నీ గొడవలు ,అల్లరి నడుస్తూ ఉంటుంది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే చిత్రమిది.

చాలా ఎంజాయ్ చేశాను…

రమ్య కృష్ణతో యాక్టింగ్ అన్నపుడు ముందు కాస్త టెన్షన్‌గానే అనిపించింది. కానీ ఆమె తన రోల్‌లో సూపర్బ్‌గా నటించారు. ఆమెతో కలిసి పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను.

తదుపరి చిత్రాలు…

ప్రస్తుతం ‘థ్యాంక్ యూ’ షూటింగ్ జరుగుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. అది కూడా దర్శకుడు విక్రమ్ చేస్తున్నాడు. ఇది ఆసక్తికరంగా ఉండే మంచి హారర్ డ్రామా. అలాగే అమీర్‌ఖాన్‌తో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కూడా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News