Monday, December 23, 2024

‘రాధేశ్యామ్’ మంచి లవ్‌స్టోరీ

- Advertisement -
- Advertisement -

Interview with Hero Prabhas

 

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్‌తో ఇంటర్వూ విశేషాలు…

ప్రేమ, విధికి మధ్య…

‘రాధేశ్యామ్’ చిత్రంలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాద్యిత పాత్ర గురించి దర్శకుడు రాధాకృష్ణ కుమార్ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఇదేదో మనం నమ్మనిది చేయాల్సి వస్తుందా? అనిపించింది. ఇంటర్వెల్ వరకూ కథ విని ‘నా వల్ల కాదులే.. చేయలేను’ అని చెప్పేదామని అనుకున్నా. కానీ సెకెండాఫ్ కథ మొదలుపెట్టాక విక్రమాదిత్య పాత్ర కొత్తగా అనిపించింది. ప్రేమ, విధికి మధ్య సాగే ఈ కథ ఆసక్తికరంగా అనిపించింది.

మంచి లవ్ స్టోరీ…

‘బాహుబలి’ తర్వాత హీరోగా స్పాన్ మారింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మరింత బాధ్యత పెరిగింది. ‘రాధేశ్యామ్’ కథ కాస్త వెరైటీగా అనిపించడంతో అంగీకరించా. లవ్‌స్టోరీ చేసి చాలా కాలం అయింది. ఇదొక మంచి లవ్‌స్టోరీ అవుతుంది.
దేవుడిలా కనిపించారు…

యాక్టింగ్ అనగానే పెదనాన్న కృష్ణంరాజుకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఈ చిత్రంలో ఆయన పరమహంసగా నటించారు. తన పాత్ర కోసం గడ్డం పెంచారు. నా టీమ్ అంతా పెదనాన్నతో మాట్లాడటానికి భయపడతారు. ఈ పాత్ర చేయాలి అని నాతోనే అడిగించారు. కూల్‌గా ఉండే పరమహంస పాత్రలో పెదనాన్నని చూస్తే దేవుడిలా కనిపించారు. పెదనాన్నతో నేను రెండు సన్నివేశాల్లో కనిపిస్తా.

అది సస్పెన్స్…

భాగ్యశ్రీని చూడగానే నిజంగా అమ్మ అనే ఫీలింగ్ కలిగింది. ఆమె కూల్‌గా, పాజిటివ్‌గా ఉంటారు. మా ఇద్దరి మధ్య తల్లీ కొడుకుల బంధం ఎలా ఉందనేది తెరపైనే చూడాలి. అది సస్పెన్స్. అందుకే ట్రైలర్‌లో కూడా మా ఇద్దరి సన్నివేశాలు చూపించలేదు.

సమ్‌థింగ్ స్పెషల్‌గా…

ఈ సినిమాలోని షిప్ ఎపిసోడ్ కోసం దర్శకుడు రాధాకృష్ణ రెండేళ్లు కష్టపడ్డారు. ఈ సీన్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. 13 నిమిషాల పాటు ఉండే ఈ సీన్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. ‘రాధేశ్యామ్’లో యాక్షన్ ఉంది కానీ ఫైట్లు లేవు. లవ్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News