Saturday, December 28, 2024

అందుకే ‘డిఎస్‌జె’ చేశా

- Advertisement -
- Advertisement -

Interview with Heroine Natti Karuna

 

నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘డిఎస్‌జె‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వంలో నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని ఈనెల 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కథానాయిక నట్టి కరుణ మీడియాతో మాట్లాడుతూ “నటిగా తొలి సినిమాను ఎవరైనా ప్రేమ కథలనే ఎంచుకుంటారు. అలాకాకుండా నటనకు పూర్తి అవకాశం ఉన్న పాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో ‘దెయ్యంతో సహజీవనం’ సినిమా చేశాను. ఈ కథలో కొంచెం లవ్ కూడా ఉంటుంది. అలాగే యాక్షన్, మధ్య తరగతి అమ్మాయిగా మరో కోణం కూడా ఈ కథలో కనిపిస్తుంది.

హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ కథ ఇది. అయితే కథనంలో కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. ఎవరూ ఊహించిన విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో అమ్మవారికి, దెయ్యం మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్ అవుతాయి. ఈ సినిమా చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐదు అంతస్తుల పైనుంచి దూకడం, కారు గిర్రున తిరగడం… వంటివి ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఈ సినిమాలో రెండు పాటలుంటాయి. నటనకంటే డాన్స్ చేయడం కష్టమనిపించింది. ఎందుకంటే కాశ్మీర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో సాంగ్ చేసేటప్పుడు కాళ్లు సహకరించలేదు”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News