Monday, December 23, 2024

‘హీరో’లోనూ అలాంటి పాత్రే

- Advertisement -
- Advertisement -

Interview with Heroine Nidhi Agarwal

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతూ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హీరో’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ “దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కథ చెప్పగానే ఆఫ్‌బీట్ సినిమాగా అనిపించింది. అయినా సాంగ్స్ ఉన్నాయి. కమర్షియల్ అంశాలున్న కథ భిన్నంగా అనిపించింది. హీరో గల్లా అశోక్‌తో నటించడం కష్టం అనిపించలేదు. నటుడిగా కొత్తవాడనే ఫీల్ నాకు కలగలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’లో డాక్టర్‌గా చేశాను. ‘హీరో’ సినిమాలోనూ అలాంటి పాత్రే వచ్చింది. ఈ సినిమాలో నా తండ్రిగా జగపతిబాబు, హీరో తండ్రిగా నరేష్ నటించారు. ఈ కథ రెండు కుటుంబాల మధ్య జరిగే డ్రామా. సందర్భానుసారంగా కామెడీ కూడా ఉంటుంది. కథలో కొన్ని ట్విస్ట్‌లు కూడా ఉన్నాయి. ఇక నాకు యాక్షన్ పాత్రలంటే ఇష్టం. పవన్‌కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’లో నాకు కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని చాలా ఇష్టంగా చేశాను. ఇది పీరియాడిక్ మూవీ”అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News