Sunday, December 22, 2024

పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

Interview with Ketika sharma

 

అందాల భామ కేతిక శర్మ తన మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’లో మెగా హీరో వైష్ణవ తేజ్ పక్కన నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె రాధ అనే పాత్రలో నటిస్తోంది. తనకి, వైష్ణవ్‌కి మధ్య జరిగే కెమిస్ట్రీ చాలా బాగుంటుందని.. అలాగే ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఆమె మీడియా సమావేశంలో చెప్పింది. సినిమాలో నా రోల్ పక్కింటి అందమైన అమ్మాయిలా ఉంటుందని తెలిపింది. ఇంతకు ముందు తను చేసిన చిత్రాలు యూత్‌కు మాత్రమే నచ్చాయని.. కానీ ఇప్పుడు ఈ చిత్రం అన్ని వయస్సుల వారికి బాగా నచ్చుతుందని పేర్కొంది. ఖచ్చితంగా ‘రంగ రంగ వైభవంగా’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లుగా కేతిక వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News