Sunday, January 12, 2025

నేను నెం.2 కాదు.. 3 కాదు నాలుగేళ్లు రేవంత్ రెడ్డే నెం.1

- Advertisement -
- Advertisement -

సంక్షేమ పథకాలతో పేదల మనస్సుల్లో చెరగిపోని
స్థానం బిఆర్‌ఎస్ పాలనలో
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం సాగర్ వద్ద 2,600 ఎకరాలు
కబ్జా చేసిన బిఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ పరిధిలో రూ.1800 కోట్ల
భూములు ‘గులాబీ’ నేతల పేరిట పట్టా సిద్దిపేటలో 400 ఎకరాలు మాయం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు
పంచుతాం ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వూలో రెవెన్యూ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా బిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ భూ ములను అన్యాక్రాంతం చేశారు. ఆ భూములను త్వరలో స్వాధీ నం చేసుకొని వారిపై కేసులు న మోదు చేస్తాం. గత ప్రభుత్వం హ యాంలో 2014 కంటే ముందు నిషేధిత జాబితాలో ఉన్న భూములను అప్పనంగా ప్రైవేటు పరం చేశారు. ఇలాంటి భూములను గుర్తించి 2వేల ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. వా టిపై ఎలాంటి క్రయ, విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టాం. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ జీఓ 59ను అడ్డుపెట్టుకొని రూ.1,800 (సుమారుగా 18 నుంచి 20 ఎకరాల భూములను) కోట్ల విలువైన భూములను బిఆర్‌ఎస్ నాయకులు పట్టాలు చే సుకొని వాటిని వివిధ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. వా టిని కూడా తిరిగి తీసుకుంటాం. ఈ భూములను అవసరమైన చో ట్ల ప్రభుత్వం కోసం వినియోగించుకోవాలని నిర్ణయించాం. భూ ములు లేని పేదలకు వాటిని పం పిణీ చేస్తామని మంత్రి పొంగులే టి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జీఓ 59 కింద సరిగా ఉన్న దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామన్నా రు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ‘మన దినపత్రిక’కు రెవెన్యూ, హౌసిం గ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏడాది పాలన తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పేదలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తూ వా రి మనస్సుల్లో కాంగ్రెస్‌కు చిరస్థాయి స్థానం ద క్కిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను నెంబర్ 2, నెంబర్ 3 కాదనీ తాను 11వ నెంబర్ నని అన్నారు. రానున్న నాలుగేళ్లు కూడా సిఎం గా రేవంత్‌రెడ్డి కొనసాగుతారన్నారు. ఇలా ఏడా ది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన నిర్ణయా లు గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల గురించి ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని, ఫోన్ ట్యాపిం గ్, ధరణి తదితర కుంభకోణాలు జరిగాయన్నా రు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి బిఆర్‌ఎస్ నాయకులు ఫలితాలు అనుభవించారని మంత్రి ఆరోపించారు. ఇంటర్వూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్ర ప్రభుత్వం విఆర్‌ఓలపై సంక్రాంతిలోపు కీలక ని ర్ణయం తీసుకోనుంది. ఈ విషయమై కసరత్తు ప్రారంభించాం. గత ప్రభుత్వం 26 వేల మంది విఆర్‌ఓల వ్యవస్థను ధ్వంసం చేసింది. అందుకే విఆర్‌ఓ వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతు న్నాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాం. తమ స్వలాభం కోసం విఆర్‌ఓ, విఆర్‌ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం ర ద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయంలో సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 236 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నా రు. త్వరలో ఆ సంఖ్యను 1,000కి పెంచుతాం.

ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళ న ప్రారంభించాం. విదేశీ సంస్థ చేతుల్లో ఉన్న ధ రణి భూముల వివరాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఐసీ చేతిలో పెట్టాం. ధరణి పో ర్టల్‌లో ప్రస్తుతం ఉన్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11-నుంచి 13 మాడ్యూల్స్ మాత్రమే పెట్టాలని ని ర్ణయించాం. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కా లమ్ ఉంది. ఇక నుంచి పహాణీల్లో 12 లేదా 13 కాలమ్స్ పెడతాం. భూముల పుట్టు పూర్వోత్తరాలను అందులో నమోదు చేస్తాం. పెండింగ్‌లో ఉ న్న 2.46 లక్షలు, మరో 2.60లక్షల దరఖాస్తు లు కలిపి 5లక్షలకు పైగా ధరణి దరఖాస్తులను పరిష్కరించాం. విధానాన్ని మార్చి ధరణి దరఖాస్తులు ఆమోదించినా, తిరస్కరించినా కారణాలు చెప్పేలా 15 రోజుల్లో పారదర్శకతను తీసుకొచ్చాం. పునర్నిర్మాణ కమిటీ ని యమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రి కార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ ఓ ఆర్) చట్టాన్ని మార్చే ప్ర యత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను అసెంబ్లీలో పెట్టి ప్రజల్లో చర్చకు పెట్టాం. ఈ అ సెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉండే ఈ చట్టం ఆమోదం కోసం బిల్లు ప్రవేశపెడతాం. ధరణి పేరు మార్చి వేరే పేరును పెడ తాం.

ధరణి కారణంగా అనేక గ్రామాల్లో భూము ల సమస్యలు వచ్చాయి. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వ చ్చాయి. భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్, వ రంగల్, ఖమ్మం లాంటి జిల్లాల్లో వక్ఫ్, అటవీ భూముల సమస్యలున్నాయి. వీటిని సర్వే చేసి డీమార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శా ఖకు ఇచ్చేస్తాం. దాదాపు 12 లక్షల ఎకరాల భూ ములపై స్పష్టత వచ్చింది. మరో మూడు లక్షల్లో సరిహద్దు వివాదాలున్నాయి. పార్ట్-బిలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూ ములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. సిద్ధిపేటలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని 10 మంది బిఆర్‌ఎస్ నాయకులు కొల్లగొట్టారని ప్రభుత్వ విచారణలో తేలింది. త్వరలోనే వాటిపై అధికారులు నివేదిక ప్రభుత్వానికి అందచేస్తారు. నాగార్జున సాగర్‌లోని తిరుమలగిరి మండలంలో 14 గ్రామాల్లోని 2,600 ఎకరాల భూములను కొందరు బిఆర్‌ఎస్ నాయకుల అన్యాక్రాంతం చేశారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ భూముల కబ్జాపై విచారణ చేపడుతాం.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక యాప్ సిద్ధం చేశాం. లబ్ధిదారుల ఎంపికలో ఈ యాప్‌దే కీలకపాత్ర. 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఖరారు చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. లబ్ధిదారులను ఇందిర మ్మ కమిటీలే ఫైనల్ చేస్తాయి. స్మార్ట్ కార్డుల ఆ ధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ని మహిళల పేరుతోనే ఈ ఇళ్లు మంజూరు చేయబోతున్నాం. 4 రాష్ట్రాల్లోని ఇళ్ల నిర్మాణానికి సం బంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తు న్నాం. ఈ ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలి. దీంతోపాటు ప్ర తి ఇళ్లు 400 చదరపు అడుగుల పైచిలుకు ఉం డాలన్న నిబంధనను కచ్చితంగా అమలుచేయా లి. మొదటిఫేజ్‌లో నాలుగున్నర లక్షల ఇండ్లను పంపిణీ చేస్తాం. ప్రతి లబ్ధిదారునికి సుమారుగా రూ.5 లక్షలను నాలుగు విడుతలుగా పంపిణీ చే స్తాం. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. తొలి విడతలో సు మారుగా రూ.28 వేల కోట్లు ఖర్చు కావచ్చు. ఇ ప్పటికే బడ్జెట్‌లో సుమారుగా రూ.7,740 కోట్ల ను ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తాం. గత ప్రభుత్వంలో గృహజ్యోతి కింద నిలిచిపోయిన సుమారు 600-ల నుంచి 800 ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తాం. ఇళ్ల స్థలాలు లేని వారికి రెండో దశలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిస్థలం లేని వారికి 75 నుంచి 80 గజాల స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తాం. అంగవైకల్యం ఉన్న వికలాంగులు, వితంతులకు, నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. రేషన్‌కార్డులకు సం బంధించి ఈనెలలోనే విధానాలను ప్రకటిస్తాం.
బిఆర్‌ఎస్ ఆరోపణల్లో నిజం లేదు

బిఆర్‌ఎస్ నాయకులు తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదు. ఈడీ కానీ, వేరే సంస్థ కానీ, తన సం స్థపై, ఇంటిపై దాడులు చేసినప్పుడు ఎలాంటి డ బ్బులు దొరకలేదు. ఒకవేళ అందులో నిజం ఉం టే ప్రతిపక్షాలు అడగకముందే ఆ విషయాలను బయటకు చెబుతా. ప్రస్తుతం నిజం కానీ, ఆరోపణలతో తనపై, తన కుటుంబంపై బిఆర్‌ఎస్ నా యకులు అడ్డగోలు మాట్లాడుతున్నారు. అలాంటి విమర్శలపై నేను స్పందించాలనుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పడకముందే నాకు వ్యాపారులు ఉ న్నాయి. ప్రస్తుతం మంత్రిని అయ్యాక తాను కా నీ, తన కుటుంబసభ్యులు గానీ, ఎలాంటి వ్యాపా ర భాగస్వామ్యంలో పాలుపంచుకోవడం లేదు.

బాంబు పేలడమంటే
జైల్లో పెట్టడం కాదు
బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదు.. అధికారంలో ఉన్న పదేళ్లు బిఆర్‌ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహారించింది. ఇందుకు సంబంధించి 10 నుంచి -12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుం డవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ-రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు. బట్ట కాల్చి మీద వేయడమే బిఆర్‌ఎస్ పని. ఈ రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News