Sunday, December 22, 2024

చాలా గర్వంగా అనిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

Interview with Ram charan tej

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29 గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్‌చరణ్ హైదారాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

నా పాత్ర మరింత పెరిగింది

ముందు నేను ఈ సినిమాలోకి నిర్మాతగా ప్రవేశించిను తప్ప నటుడుగా కాదు. కానీ తర్వాత నటుడుగా కూడా ఉంటానని, కొంచెం చిన్న పాత్ర ఉంటుందని నాకు చెప్పారు. కథకి ఇది చాలా ముఖ్యం అని తెలుసు. కానీ తర్వాత నా పాత్ర మరింత పెరిగింది. నాన్న గారితో సినిమా కావడంతో వెంటనే ఓకే చేసేసాను.

దర్శకుడు అద్భుతంగా చూపించాడు

ఈ సినిమాలో నాన్న గారిది, నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ అంతిమంగా ధర్మం కోసమే ఆయన నిలబడతారు. నేను గురుకులంలో కనిపించే అబ్బాయిలా నటించాను. అలాగే నాన్న గారు ఒక ఫైటర్‌లా కనిపిస్తారు. అలాంటి ఇద్దరు ఎలా కలుస్తారు, కలిస్తే ఎలా ఉంటుందో అనేది దర్శకుడు శివ అద్భుతంగా చూపించాడు. నాన్న గారితో కలిసి నటించడం చాలా గర్వంగా అనిపిస్తోంది.

ఇద్దరికి కుదిరినప్పుడే చేస్తాము

మా బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి బ్యానర్‌లో నా సినిమా ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇద్దరికి కుదిరినప్పుడే ఈ సినిమాలు ఉంటాయి. బాబాయ్‌తో సినిమా నేను చేసిన ఆయన ప్రొడ్యూసర్‌గానే కాకుండా కో ప్రొడక్షన్‌లో ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఆయన ఇప్పుడు చాలా ప్రాజెట్స్ ఒకే చేసారు. ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు.

సీన్స్ అన్ని సహజంగా ఉంటాయి

నేను ఈ సినిమాలోకి వచ్చాక ఎక్కడా కూడా ఎలాంటి మార్పులు లేవు. నాన్న గారు, నా పాత్రకు చాలా తేడా ఉంటుంది. సినిమాలోని అన్ని సీన్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. అంతే తప్ప ఎక్కడా కూడా కావాలని జత చేసిన సీన్స్ ఇందులో ఉండవు.

మా కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూస్తారు

పూజా హెగ్డే చాలా బాగా నటిస్తుంది. ముందుగా రంగస్థలంలో ఓ సాంగ్ చేసాము. ఇప్పుడు ఆచార్య విడుదల తర్వాత మా కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ప్రేక్షకులు చూస్తారు.

నాకు సరిపోయే పాత్ర వస్తే హిందీలో చేస్తా

ఏ బాలీవుడ్ డైరెక్టర్ అయినా నాకు సరిపోయే పాత్ర తీసుకొస్తే హిందీలో ఖచ్చితంగా సినిమా చేస్తాను. బాలీవుడ్‌లో ఈ తరహా సినిమానే చెయ్యాలి అని ఏమీ లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News