Monday, November 18, 2024

దర్శకుడిగా ఇది నాకు ఒక ఛాలెంజ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇంటర్వూ…
కొన్ని సంఘటనల ఆధారంగా…
1982లో రామారావు పార్టీ పెట్టినప్పుడు మా నాన్న ఊర్లో చాలా క్రియాశీలంగా వుండేవారు. ఒక కొత్తపార్టీ వస్తుందంటే జీవితాల్లో ఏదో కొత్త మార్పు వస్తుందనే ఆశ అందరిలో వుంటుంది. అప్పుడు వచ్చిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, కొన్ని సంఘటనల ఆధారంగా ఫిక్షన్ ని జోడించి చేసిన కథ ఇది. ఒక విధంగా చెప్పాలంటే దీనికి స్ఫూర్తి మా నాన్నగారే.

యూనిక్ స్టొరీ…
కొత్త వాళ్ళకు సరిపోయే కథ ఇది. ఈ కథ అనుకున్నపుడే రెండు పార్టులు చేయాలని అనుకున్నాం. పెదకాపు… యూనిక్ స్టొరీ. ఇందులో హింస కాస్త ఎక్కువగానే వుంటుంది. కొత ్త బంగారు లోకం, ముకుందా… ఇలా కొత్త వాళ్ళతో సినిమా అనుభవం వుంది. కొత్తవాళ్లతో చేయడం ఫ్రెష్‌గా బావుంటుంది. ఒక సవాల్‌గా చేయొచ్చు.
ఆ పాత్ర చేయడం చాలా నచ్చింది…
ఈ సినిమాలో నేను ఓ పాత్ర చేశాను. నిజానికి ఈ పాత్ర కోసం ఒక కేరళ నటుడిని అనుకున్నాం. అయితే ఆయన ఏవో కారణాలు వల్లన రాలేదు. ఆ పాత్ర చేయడం చాలా నచ్చింది. ప్రీమియర్ చూస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే ఇందులో తనికెళ్ళ భరణి పాత్రతో పాటు అన్ని ప్రధాన పాత్రలకి నా వాయిస్‌తో ఇంట్రో వీడియోలు చేసి విడుదల చేశాం. వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో రావు రమేష్, అనసూయ పాత్రలు కూడా చాలా బలంగా వుంటాయి.

మ్యూజిక్ చాలా ప్లస్…
ఈ సినిమా మ్యూజిక్‌ను మిక్కీ జె.మేయర్ చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ చాలా ప్లస్. నాతో పాటు ఆయన కూడా దీని కోసం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.
హీరో చాలా కష్టపడ్డాడు…
హీరో విరాట్ కర్ణకి ఇది తొలి సినిమా. మొదటి సినిమాకి కొన్ని కష్టాలు వుంటాయి. అయితే తనతో నటింపజేసే భాద్యత నాది. తనకి ఎలా కావాలో అలా చెప్పించి మంచి నటన రాబట్టుకున్నాను. తను కూడా చాలా కష్టపడ్డాడు.
దానికి కారణం నిర్మాత…
కొత్త వాళ్లతో ఇంత భారీ బడ్జెట్‌తో రెండు పార్టులు గా సినిమా చేయడం దర్శకుడిగా నాకు ఒక ఛాలెంజ్. ఇంత ఖర్చు చేస్తున్నారు కాబట్టి తను ఇంకా బాగా చేయాలనేది విరాట్ కి ఒక ఛాలెంజ్. ఇన్ని సవాళ్ళ మధ్య సినిమా అంత సజావుగా హ్యాపీగా సాగిందంటే కారణం.. నిర్మాత రవీందర్ రెడ్డి. ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News