Friday, November 22, 2024

గంభీరమైన ఏసీపీగా…

- Advertisement -
- Advertisement -

Interview with Sudhakar Komakula

 

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్ రోల్ చేయగా సుధాకర్ కోమాకుల ఏసీపీ రోల్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ కోమాకుల మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నాది కీలకమైన పాత్ర. గోవింద్ అనే ఏసీపి రోల్ చేశా. అతను హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇప్పటివరకూ సరదా పాత్రలు చేశా. ఇందులో నా పాత్ర గంభీరంగా ఉంటుంది. హీరో సహా మిగతా నటీనటులు అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. హీరోగా నా ఆకలి తీరలేదు. ఎక్కువ హీరో రోల్స్ చేయాలని అనుకుంటున్నాను.

అయితే మధ్యలో మంచి రోల్స్ వస్తే చేస్తాను. ఇక నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నాం. కానీ కరోనా వల్ల రెండేళ్లు పట్టింది. ఇన్ని రోజులు బాడీ మెయింటేన్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. దర్శకుడు శ్రీ సరిపల్లి చాలా కూల్‌గా అందరితో పని చేయించుకున్నాడు. అతను పని రాక్షసుడు. ప్రస్తుతం హీరోగా ‘నారాయణ అండ్ కో’ చేస్తున్నాను. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. హీరోగా ‘జీడీ’ (గుండెల్లో దమ్ముంటే) అని మరో సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరో సినిమా కూడా ఓకే అయింది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News