- Advertisement -
హైదరాబాద్: అమెరికా బి1, బి2 వీసాలకోసం ఇంటర్వ్యూలు వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం బుధవారం తెలిపింది.‘ తొలిసారి టూరిస్టు బి1, బి2 వీసాలకోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వూలు 2022 సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. తొలిసారి బి 1, బి2 వీసాలకోసం దరఖాస్తు చేసుకున్న వారిని మళ్లీ ఇంటర్వ్యూ చేస్తాం. ఇది రీఓపెన్ అయ్యే చివరి కేటగిరీగా ఉంటుంది. రాబోయే వారాల్లో వారి అపాయింట్‌మెంట్ల బుకింగ్‌ను ప్రారంభిస్తాం. ఇది చాలా వేగంగా సాగుతుంది. రోలింగ్ ప్రాతిపదికపై మరిన్ని అపాయింట్‌మెంట్లను కూడా చేరుస్తాం’ అని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ బుధవారం ఒక ట్వీట్‌లో తెలియజేశారు.
- Advertisement -