Monday, December 23, 2024

ప్రతి పాట మనసుని హత్తుకునేలా…

- Advertisement -
- Advertisement -

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ టీజర్‌లో మ్యాజికల్ కెమిస్ట్రీతో మైమరపించారు. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపథ్యంలో ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి పాట ’ఓహ్ సీతా హే రామా” సంగీత ప్రియులని అలరించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పాట ‘ఇంతందం’ ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హను రాఘవపూడి, మృణాళిని ఠాకూర్, విశాల్ చంద్రశేఖర్, కృష్ణకాంత్ పాల్గొన్నారు. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి చూడముచ్చటగా వుంది. వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ లవ్లీ మెలోడి మళ్ళీ మళ్ళీ వినాలనించేలా వుంది.

కృష్ణకాంత్ అందించిన సాహిత్యం మనసుని హత్తుకుంది. ‘ఇంతందం దారి మళ్లిందా… భూమిపైకే చేరుకున్నాదా… లేకుంటే చెక్కి వుంటారా’ అంటూ సాగే ఈ పాటని ఎస్పీ చరణ్ చాలా మధురంగా ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “ఇది చాలా సవాల్ తో కూడిన పాట. నాకు ఇష్టమైన పాట. గేయ రచయిత కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. వేటూరి గుర్తుకొచ్చారు. విశాల్ ఈ పాటని ఒక రోజులో చాలా ఆర్గానిక్‌గా క్రియేట్ చేశారు. రాయడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ముచ్చటగా కనిపిస్తారు”అని తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “హను రాఘవపూడి గొప్ప సంగీత అభిరుచి వున్న దర్శకుడు. ఈ చిత్రంలో ప్రతి పాట మనసుని హత్తుకునేలా వుంటుంది”అని చెప్పారు.

Inthandham lyrical song out from Sita Ramam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News