Monday, December 23, 2024

‘ఇంటింటి రామాయణం’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన ఆహా

- Advertisement -
- Advertisement -

 

గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ ఓటీటీ రంగంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది ఆహా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు ఎన్నో వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను అందించి వారి సంతోషంలో భాగ‌మైంది. 100 % లోక‌ల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఆహాకు తోడుకు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చేతులు క‌లిపింది. వీరి కాంబినేష‌న్‌లో రూపొందిన తెలుగు ఒరిజిన‌ల్ ఫిల్మ్ ‘ఇంటింటి రామాయణం’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఆహాలో డిసెంబ‌ర్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ టీజ‌ర్‌ను ఆహా విడుద‌ల చేశారు.

Intinti ramayanam teaser releaseప్ర‌తిరోజూ పండగే, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, శైల‌జా రెడ్డి అల్లుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాకు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా సినిమా కి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఆహాలో ఇంతకు ముందు ‘త్రీ రోజెస్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. అదే అనుబంధంతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ ఇంటింటి రామాయ‌ణంను రూపొందించాం. ఈ క‌థ మీ హృద‌యానికి హ‌త్తుకోవ‌ట‌మే కాదు.. మీరు ప్రేమించ‌న వ్య‌క్తులో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌ను గుర్తుకు తెస్తుంది.

Intinti ramayanam teaser releaseనేటి రోజుల్లో మ‌న వ్య‌క్తిగ‌త జీవితాల్లోని భావోద్వేగాల‌ను ఎమోజీల రూపంలో వ్య‌క్తం చేస్తున్నాం. కానీ ఆహాలో రాబోతున్న ఈ ఇంటింటి రామాయ‌ణం సినిమాను వీక్షించిన‌ప్పుడు మీ ఇంటి స‌భ్యుల‌కు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఒక‌వేళ వారు ఇత‌ర ప్రాంతాల్లో ఉంటే వెంట‌నే టికెట్ బుక్ చేసుకుని వెళ్లి వారిని క‌లుసుకోవాల‌నే కోరిక క‌లుగుతుంది. అంత స‌ర‌ళంగా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఉండ‌ట‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం’’మనం ఇది వరకు చూసి గ్రామీణ మధ్య తరగతి జీవిత కథలను ప్రతిబింబించే సినిమాయే ఇంటింటి రామాయణం.

Intinti ramayanam teaser releaseకరీంనగర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. అక్కడ గ్రామంలో ఉండే రాములు (నరేష్).. అతని పక్క నుండే కుటుంబం ఓ సమస్యను ఎదుర్కొంటుంది. దీంతో వారిలో ఒకరినొకరు అనుమానపడతారు. అలాంటి సమయంలో వారిలోని భావోద్వేగాలు ఎలా ఉంటాయి. అవి వారి కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేదే ప్రధాన కథాంశం. ఇప్పటికే ఆహా క్యాటలాగ్‌లో ఎన్నో విలువైన చిత్రాలున్నాయి. వాటి స‌ర‌స‌న ఇంటింటి రామాయ‌ణం కూడా చేర‌నుంది.

క‌ల‌ర్ ఫొటో, భీమ్లా నాయ‌క్‌, డీజే టిల్లు, క్రాక్ వంటి చిత్రాల‌తో పాటు అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2, డాన్స్ ఐకాన్‌, తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ వంటి స్పెష‌ల్ షోస్‌, అన్యాస్ టుటోరియ‌ల్స్‌, గీత సుబ్ర‌మ‌ణ్యం, లెవంత్ అవ‌ర్ వంటి వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఆహా మీ నాణ్య‌మైన స‌మ‌యాన్ని వెచ్చించ‌డానికి ఎప్పుడూ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కొత్త ప్రోగ్రామ్స్‌ను అందించ‌టంపై ఆహా దృష్టి పెడుతూనే ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News