Sunday, January 19, 2025

చంద్రుడి కక్ష్యలోకి పయనం

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : గత నెల 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి వరకు లూనార్ ట్రాన్సఫర్ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్ చేపట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లో నింపిన అపోజి ఇంధనాన్ని మండించి చంద్రయాన్3 మిషన్‌ను భూకక్ష నుంచి చంద్రుని కక్షవైపు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ఈ విధంగా చంద్రయాన్ 3 కక్ష దూరం మరోమారు పెంచారు. అక్కడ నుంచి ఐదు రోజుల పాటు చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలోకి తీసుకురావడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. ఆ కక్ష లోకి వచ్చాక ఆగస్టు 23న ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునికి 30 కిమీ ఎత్తుకు చేరుకుంటుంది. తర్వాత అది ల్యాండర్‌ను జార విడుస్తుంది. ఆ రోజు సాయం త్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్ విచ్చుకుని లోపలి నుంచి రోవర్ బయటకు అడుగుపెట్టనుంది. అది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేసి సమాచారాన్ని ఇస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News