Sunday, January 19, 2025

మంత్రి సమక్షంలో బిఆర్‌ఎస్‌లోకి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 16వ వార్డు బోయపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, టిడిపి వార్డు అధ్యక్షుడు యాదగిరి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద గొల్ల వెంకటయ్య కేశవ్ సహా సుమారు 50 మంది , 16వ వార్డు కౌన్సిలర్ మోతిలాల్ , వార్డు బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యం ఆధ్వర్యంలో డా. వి. శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అదే విధంగా జిల్లా కేంద్రంలోని బికే రెడ్డి కాలనీలో వార్డు పర్యటన చేసి స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, సిబ్బందికి చేపట్టాల్సిన పనుల వివరాలను తెలియజేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ఆనంద్‌కుమార్‌గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News