Sunday, January 19, 2025

నెల రోజుల పాటు నిఘా.. మత్తు మెడికల్ డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: రాజేంద్ర నగర్‌లో మత్తు మెడికల్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫెంటనాయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ను అమ్ముతున్న వైద్యుడిని అరెస్ట్ చేశారు. ముస్తఫా సమీర్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. హెరాయిన్ కంటే 50 రెట్లు, మార్ఫిన్‌కు 100 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉన్న డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. డాక్టర్స్ దంపతులు పోర్టర్ యాప్ ద్వారా ఇతరులకు సప్లై చేస్తున్నారు. ఒక్కో బాక్స్ ఇంజెక్షన్‌లను పెద్ద మొత్తానికి అమ్ముతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు నెల రోజుల పాటు వైద్యుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News