యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించాల్సిన అవసరం ఉంది
“ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్” ( పర్సనల్ అసిస్టెంట్ ) గా రాణించేందుకు యువతకు కొత్త కోర్సు దోహదం చేస్తుంది
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, పాలకవర్గం ఈ దిశలో ముందుకు సాగాలి
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ కి లేఖ
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ :”స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం” కోర్సును కొత్తగా ప్రవేశ పెట్టాలనీ, ఈ దిశలో పాలకవర్గం ముందుకు సాగాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే. సీతారామారావుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. ఈ మేరకు బుధవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వినోద్ కుమార్ లేఖ రాశారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్” ( పర్సనల్ అసిస్టెంట్ ) గా రాణించేందుకు యువతకు ఈ కొత్త కోర్సు దోహదం చేస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, పాలకవర్గం ఈ దిశలో ముందుకు సాగాలనీ ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు, సమాజంలోని పెద్దలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులు, ఇతర ప్రముఖుల వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లుగా యువత రాణించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ వివరించారు. ఉన్నత స్థాయిలో ఎన్ని డిగ్రీలు ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. నైపుణ్యవంతులైన యువతకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఇది డిమాండ్ తో కూడిన కోర్సు అని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
యువతలో స్కిల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఆయన తెలిపారు. అందుకోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో స్కిల్ డెవలప్మెంట్ కొత్త కోర్సును ప్రవేశపెట్టి అందుకు అనుగుణంగా కరికులం, కోర్సును డిజైన్ చేయాలని వీసీ కి రాసిన లేఖలో వినోద్ కుమార్ సూచించారు.