Wednesday, January 22, 2025

హీరో మావెరిక్ 440 ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హీరో మోటోకార్ప్ తన అత్యంత శక్తివంతమైన బైక్ హీరో మావెరిక్ 440ని ఆవిష్కరించింది. దీంతో పాటు హీరో మీడియం రేంజ్‌లో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ను విడుదల చేసింది. కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ నేక్డ్ ఎడిషన్ అయిన హీరో ఫరెవర్ అనే కాన్సెప్ట్ బైక్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే మావెరిక్ ధర ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. మావెరిక్ కోసం బుకింగ్‌లు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 2 లక్షలు ఉండొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News