Monday, December 23, 2024

బెంగాల్ సిఎం మమతా ఇంట్లోకి చొరబడిన అగంతకుడు

- Advertisement -
- Advertisement -

Mamata Benerjee

కోల్‌కతా: జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రంతా ఆ ప్రాంగణంలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తిని సీఎం నివాసం ఆవరణలో చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం అనుకొని తాను ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించినట్లు నిందితుడు తెలిపాడు.

కానీ అర్ధరాత్రి సమయంలో పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏం పని? అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేక తడబడ్డాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అర్ధరాత్రి సీఎం నివాసంలోకి అక్రమంగా చొరబడ్డందుకు హఫీజుల్‌ మొల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ నిమిత్తం అతడ్ని జులై 11 వరకు కస్టడీకి తరలించారు.

కోల్‌కతాలోని సీఎం నివాసంలోకి ప్రవేశించిన ఈ వ్యక్తి పేరు హఫీజుల్‌ మొల్లా. వయసు 30 ఏళ్లకుపైగా ఉంటుంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హష్నాబాద్‌కు చెందిన ఇతడు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:20 గంటల సమయంలో కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్‌ ఛటర్జీ వీధి 34-బిలో గోడ దూకి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించాడు. పటిష్ఠ భద్రత ఉన్నా ఎవరికంటా పడకుండా లోనికి వెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News