Sunday, December 22, 2024

కొత్త మండలంగా ‘ఇనుగుర్తి’

- Advertisement -
- Advertisement -

'Inugurthi' as new mandal in Mahabubabad

వెంటనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సిఎస్‌ను ఆదేశించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ’ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉన్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

కాగా సిఎం తీసుకున్న నిర్ణయంపై సంబంధిత మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ప్రగతి భవన్‌లో కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక శాసనసభ్యుడు శంకర్ నాయక్, ఎంఎల్‌సి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News