Wednesday, January 22, 2025

భూ కబ్జాలపై విచారణ జరిపించండి

- Advertisement -
- Advertisement -

 

2001లో కూకట్ పల్లి మండలం శంశి గూడ, ఎల్లమ్మబండ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 57 లో 200 మంది దళిత కుటుంబాలకు భూమి పట్టాలు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన భూములను అక్రమంగా మాజీ మంత్రి, హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులు, అనుచరులు కబ్జా చేసారని బాధితులు వాపోయారు. వారి నుండి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.

తమ భూములపై కన్నేసిన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ‌తమకు న్యాయం చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన భాదితులు విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ అనుచరుల భూ కబ్జాలపై ఈడీ, విజిలెన్స్ విచారణ చేయాలని లేఖలో కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులతో మాట్లాడి భూ కబ్జాకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News